న్యూఢిల్లీ: ట్రైన్ క్లీనింగ్ (Train Cleaning) విధానం కాలానుగుణంగా మారిదంటూ రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో ఆదివారం షేర్ చేసింది. గత కొన్నేళ్లుగా సిబ్బంది రైలు బోగీలను చేతులతో, చేతి స్ప్రే పంపుతో శుభ్రం చేస్తున్నారు. అయితే ఇటీవల ఆధునిక క్లీనింగ్ వ్యవస్థను రైల్వే ప్రవేశపెట్టింది. నీరు వెదజల్లే షవర్ కింద రైలు మెల్లగా వెళ్తుండగా రైలు పట్టాలకు ఇరు పక్కల ఉన్న బ్రెష్‌ల ద్వారా ట్రైన్ కంపార్ట్మెంట్లు ఆటోమేటిక్‌గా క్లీన్ అవుతాయి. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో పోస్ట్చేసింది. ‘హ్యాండ్ ప్రెస్ నుంచి సిస్టమాటిక్ స్విచ్ వరకు’ అని శీర్షిక పెట్టింది. గత కొన్ని ఏళ్లుగా పాటిస్తున్న రైలు క్లీనింగ్ విధానం ప్రస్తుతం ఇలా మారిందని పేర్కొంది.
మరోవైపు, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 17 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటికే సుమారు నాలుగు లక్షల మంది వీక్షించారు. వేలాది మంది లైక్ చేశారు. చాలా మంది నెటిజన్లు పాజిటివ్‌గా కామెంట్లు చేశారు. ‘ఇది కొత్త భారతదేశం, అభివృద్ధి చెందుతున్నది. అయితే ఇంకా చెందాల్సి ఉంది. మనం త్వరలో దానిని సాధిస్తాం. మనమందరం కలిసి దేశాన్ని మరింతగా అభివృద్ధి చేయగలం’ అని ఒకరు పేర్కొన్నారు. కొన్ని రంగాల్లో ఆటోమేషన్ వినియోగం మంచిదేనని మరొకరు వ్యాఖ్యానించారు. కాగా, ఇది అద్భుతంగా ఉందని ఒకరు కొనియాడారు. అయితే ఈ ఆధునాతన క్లీనింగ్ వ్యవస్థను అమలు చేయడానికి ఇంత కాలం ఎందుకు పట్టిందని ఒకరు ప్రశ్నించారు.
From hand press to systematic switch. pic.twitter.com/J9jaTnmUrJ
— Ministry of Railways (@RailMinIndia) February 26, 2023