న్యూఢిల్లీ : మధుమేహాన్ని అదుపులో ఉంచుకోగలం తప్ప, శాశ్వతంగా నిర్మూలించలేం. నూటిలో 13 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. మధుమేహం రాకుండా ఉండేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? ఏ నియమాలు పాటించాలో.. 18,090 మందిపై అధ్యయనం చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్-ఇండియా డయాబెటిస్ మ్యాథమెటికల్ మాడల్‌ను తెచ్చింది. ఆహారంలో కార్బోహైడ్రేట్ల స్థాయిని తగ్గిస్తూ, ప్రొటీన్ల మోతాదును పెంచితే టైప్-2 డయాబెటిస్ పెరుగకుండా అడ్డుకోవడంతో పాటు కొత్తగా డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తున్నవాళ్లు ఆ రోగంబారి నుంచి తప్పించుకోవచ్చని సూచించింది.
50%: ఆకుకూరలు, కూరగాయలు (బీన్స్, క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటివి మంచిది)
25%: ప్రొటీన్సహిత ఆహారం (చేప, చికెన్, సోయా వంటివి తీసుకోవచ్చు. మటన్ తినొద్దు)
25%: తక్కువ మోతాదులో అన్నం, ఒకటి లేదా రెండు చపాతీలు
ఇలా కట్టడి చేయవచ్చు
మనం తీసుకుంటున్న ఆహారంలో 60-75 శాతం వరకూ కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి. కేవలం 10 శాతమే ప్రొటీన్లు ఉంటున్నాయి. దీని వల్లే డయాబెటిస్ వంటి రోగాలు వస్తున్నాయి. ఒకవేళ ఒకవ్యక్తి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ మోతాదును 50-55 శాతానికి తగ్గిస్తే, డయాబెటిస్‌ను కట్టడి చేయవచ్చు.
-డాక్టర్ వీ మోహన్, అధ్యయన కర్త