MLA Nagendra | బళ్లారి: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముడా స్కామ్లో ఇరుక్కోవడంతో సీఎం పదవిని కోరుకుంటున్న ఆశావహుల సంఖ్య ఆ పార్టీలో రోజురోజుకు పెరిగిపోతున్నది. ఈ క్రమంలో కోట్ల రూపాయల వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే బీ నాగేంద్ర గురువారం బెయిల్పై విడుదలయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టానికి ముఖ్యమంత్రిని అయ్యే అవకాశం ఉన్నందున తనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు. ఇప్పటికే 18 క్రిమినల్ కేసులు ఉన్నఆయన దానిని సమర్థించుకుంటూ 100 క్రిమినల్ కేసులున్న వారు కూడా ముఖ్యమంత్రులైన సంఘటనలు ఉన్నాయన్నారు.
కాంగ్రెస్కు అంకిత భావంతో పనిచేస్తే భవిష్యత్తులో ఎందుకు సీఎంని కాకూడదు? అని ఆయన పేర్కొన్నారు. తనను తిరిగి మంత్రిని చేసేదీ లేనిది అధిష్ఠానం ఇష్టమని చెప్పారు. పార్టీలో ఎదుగుతున్నందునే బీజేపీ తనను టార్గెట్ చేసిందని నాగేంద్ర ఆరోపించారు.