న్యూఢిల్లీ, అక్టోబర్ 25: యుద్ధాలను నివారించి, శాంతియుత పరిష్కారాల కోసం ప్రయత్నించే ప్రధాన లక్ష్యంతో ఏర్పడిన ఐక్యరాజ్య సమితి (యూఎన్) తీరు పట్ల భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యూఎన్ 80వ వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడు తూ పహల్గాం ఉగ్ర దాడికి తామే కారణమని ప్రకటించిన సంస్థకు ఐరాస భద్రతా సమితి సభ్య దేశం ఒకటి ఎందుకు రక్షణ కల్పిస్తున్న దని ప్రశ్నించిన ఆయన ‘ఐక్యరాజ్య సమితితో అంతా బాగా లేదు’ అని వ్యాఖ్యానించారు.
ఉగ్రదాడులకు బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించే సంస్థను భద్రతా మండలిలో పనిచేస్తున్న సభ్యదేశం ఒకటి బహిరంగంగా సమర్థిస్తున్నప్పుడు అది బహు పాక్షికత విశ్వసనీయతకు ఏం చేస్తుందని పరోక్షంగా పాకిస్థాన్‌ను ప్రస్తావిస్తూ ప్రశ్నించారు.