మే , జూన్ కూడా రాలేదు.. అప్పుడే ఎండలు విశ్వరూపం చూపిస్తున్నాయి. ఏప్రిల్ మాసమే మే, జూన్ మాసాలుగా మారిపోయింది. 122 ఏళ్లలో నార్త్ ఇండియాతో పాటు మరి కొన్ని ప్రాంతాలు ఎన్నడూ ఇంత ఎండలను చూడలేదు. అంత ఎండలు కొడుతున్నాయి.
ఏప్రిల్ మాసంలోనే 37.78 డిగ్రీల సెల్సియస్కి ఉష్ణోగ్రతలు చేరుకున్నాయంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్లే ఈ ఇబ్బందులు అని వాతావరణ శాఖ పేర్కొంది.
భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర ఈ విషయాన్ని వెల్లడించారు. మే, జూన్ మాసాలు కూడా రాకమునుపే ఎండలు విజృంభిస్తున్నాయని, మే, జూన్ మాసాల్లాగా ఉష్ణోగ్రతలు మారిపోయాయని అన్నారు. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో ఎండలు విపరీతంగా వున్నాయని, మే మాసంలో కూడా ఇలాగే కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.
ఇక దేశ వ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగానే నమోదయ్యే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు. అయితే వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు.