న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పసి బిడ్డల అక్రమ రవాణా కేసుల్లో వ్యవహరిస్తున్న తీరుపై మంగళవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నేరాలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన మార్గ దర్శకాలను జారీ చేసింది.
దవాఖానల్లో నవజాత శిశువులు అక్రమ రవాణాకు గురైతే వాటి లైసెన్సులు రద్దు చేయాలని స్పష్టంచేసింది. ఈ విషయంలో అలసత్వం వహిస్తే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించింది. కేసులను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని హైకోర్టులను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.