Road Accident | దేశంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. రాజస్థాన్ జైపూర్ (Jaipur)లో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. హర్మద ప్రాంతంలోని (Harmada area) రద్దీగా ఉండే సికార్ రోడ్డు (Sikar Road)లో వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
లోహమంది ప్రాంతంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ ఘటన జరిగింది. అతి వేగంతో వచ్చిన టిప్పర్ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆ వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సుమారు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇవాళ ఉదయం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టిన విషయం తెలిసిందే (Chevella Accident). ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకూ 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వరుస రోడ్డు ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Also Read..
Air Pollution | ఢిల్లీలో కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. అయినా పూర్ కేటగిరీలోనే వాయు కాలుష్యం
Chevella Accident | చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన