సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 11:40:24

గాల్లో హ‌నీమూన్‌కు వెళ్లిన దంప‌తులు.. 5 సెకండ్లు మాత్ర‌మే!

గాల్లో హ‌నీమూన్‌కు వెళ్లిన దంప‌తులు.. 5 సెకండ్లు మాత్ర‌మే!

ఈ వీడియో చూస్తే భైర‌వ ద్వీపం సినిమానే గుర్తుకు వ‌స్తుంది. అందులో రాక్ష‌సుడు రాజ‌కుమారిని మంచంతో స‌హా గాల్లో అప‌హ‌రిస్తాడు. ఈ దంప‌తులు అచ్చం అలానే బెడ్‌తో స‌హా హ‌నీమూన్‌కు వెళ్లాల‌నుకున్నారు. అందుకు మంచానికి చ‌క్రాల‌ను అమ‌ర్చారు.

చ‌క్రాల మంచం ఎక్కి ఎత్తైన కొండ మీద నుంచి కింద‌కి జారారు. అంతేకాదు గాల్లోకి ఎగ‌ర‌గానే అక్క‌డున్న ఎనిమిది లారీల‌ను దాటుకొని అవ‌త‌ల ప‌డ్డారు. మంచానికి చ‌క్రాలు ఉండ‌డంతో ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా అలానే ముందుకు సాగారు. ఈ వీడియో చూస్తున్నంత‌సేపు గుండె ఆగినంత ప‌న‌వుతుంది. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. 

 


logo