Manish Sisodia : ఆలస్యంగానైనా నిజాయితీ, సత్యమే గెలిచాయని ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయ్యి 570 రోజులకుపైగా జైల్లో ఉన్న మనీశ్‌సిసోడియాకు బెయిల్ లభించడంతో.. శుక్రవారం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇవాళ ఉదయాన్నే కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మనీశ్సిపోడియాతోపాటు పలువురు ఆప్ నేతలు కూడా ఉన్నారు. సిసోడియా మాట్లాడుతూ.. భజరంగ్ బలి ఆశీర్వాదంతోనే తాను జైలు నుంచి బయటకు వచ్చానని చెప్పారు. త్వరలో సీఎం కేజ్రీవాల్ కూడా భజరంగ్ ఆశీర్వాదంతో జైలు నుంచి విడుదలవుతారని అన్నారు. ఆ తర్వాత సిసోడియా సహా ఆప్ నేతలంతా మహాత్మాగాంధీ స్మారకమైన రాజ్‌ఘాట్‌కు వెళ్లి గాంధీజీకి నివాళులు అర్పించారు.
ఆ తర్వాత ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిసోడియా మాట్లాడుతూ.. ఆలస్యమైనా ఆఖరికి నిజాయితీ, సత్యమే గెలిచాయని వ్యాఖ్యానించారు. ఈ కష్టకాలం తనకు మానసికంగా మరింత బలాన్నిచ్చిందని సిసోడియా చెప్పారు. ఓ ఏడెనిమిది నెలల్లో తనకు న్యాయం జరుగుతుందని భావించానని, కానీ 17 నెలల కాలం పట్టిందని అన్నారు. ఆలస్యమైన సత్యమే గెలువడం సంతోషకరమని చెప్పారు.
రాజ్‌ఘాట్‌లో ఏర్పాటు చేసిన సభలో సిసోడియా ప్రసంగిస్తూ.. ఆలస్యమైనా ఆఖరికి నిజాయితీ, సత్యమే గెలిచాయని వ్యాఖ్యానించారు. ఈ కష్టకాలం తనకు మానసికంగా మరింత బలాన్నిచ్చిందని సిసోడియా చెప్పారు. ఓ ఏడెనిమిది నెలల్లో తనకు న్యాయం జరుగుతుందని భావించానని, కానీ 17 నెలల కాలం పట్టిందని అన్నారు. ఆలస్యమైన సత్యమే గెలువడం సంతోషకరమని చెప్పారు.
#WATCH | Delhi: AAP leader and former Deputy CM Manish Sisodia says, “… These tears have given me strength…I was hoping that justice would be delivered in 7-8 months. It took 17 months but honesty and truth have won…” pic.twitter.com/IXDgO8to0z
— ANI (@ANI) August 10, 2024
బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై ప్రతిపక్ష కూటమి ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందని సిసోడియా అన్నారు. ఇవాళ జైల్లో ఉన్నది ఆప్ కార్యకర్తలు, నేతలేగదా మనకెందుకు అనుకుంటే.. రేపు మీ వంతు కూడా రావచ్చని వ్యాఖ్యానించారు. అందరం ఒక్కతాటిపైకి వచ్చి పోరాడితే నియంతృత్వం అంతమవుతుందని, కేజ్రీవాల్ కేవలం 24 గంటల్లోనే జైలు నుంచి బయటికి వస్తాడని అన్నారు.
#WATCH | Delhi: AAP leader and former Deputy CM Manish Sisodia says, “…If we have to fight this dictatorship, we have to fight unitedly. Do not think that today the workers and leaders of Aam Aadmi Party are in jail. Tomorrow your turn will also come…I also want to tell the… pic.twitter.com/Toxkvag13q
— ANI (@ANI) August 10, 2024