సోనాలీ ఫోగట్ మృతిపై సీబీఐ దర్యాప్తు… కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సు
సోనాలీ వ్యక్తిగత సహాయకుడు సుధీర్ సాంగ్వాన్ ఆమెపై లైంగిక దాడి జరిపి హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన తల్లి మరణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని సోనాలీ చిన్న కుమార్తె డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ: బీజేపీ నాయకురాలు సోనాలీ ఫోగట్ మరణంపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. కేంద్ర దర్యాప్తు కోరుతూ గోవా సీఎం ప్రమోద్ సావంత్ రాసిన లేఖపై సానుకూలంగా స్పందించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించిందని సంబంధిత అధికారులు పీటీఐ వార్తా సంస్థకు సోమవారం వెల్లడించారు.
కాగా, హర్యానాకు చెందిన బీజేపీ నాయకురాలైన సోనాలీ ఫోగట్ ఆగస్ట్ 22న గోవాలో అనుమానాస్పదంగా మరణించారు. తొలుత ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే సోనాలీ శరీరంలో అంతర్గతంగా గాయాలున్నట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో వెల్లడైంది.
మరోవైపు సోనాలీ వ్యక్తిగత సహాయకుడు సుధీర్ సాంగ్వాన్ ఆమెపై లైంగిక దాడి జరిపి హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన తల్లి మరణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని సోనాలీ చిన్న కుమార్తె డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో సుధీర్ సాంగ్వాన్, ఆమె స్నేహితుడు సుఖ్వీందర్ వాసితోపాటు మరో ముగ్గురిపై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. సోనాలీ మరణానికి సంబంధించి ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

