లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభ్(Maha Kumbh) జరుగుతున్న విషయం తెలిసిందే. త్రివేణి సంగమంలో ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం.. జైళ్లలో ఉన్న ఖైదీలకు కూడా ఆ మహాకుంభ్ అమృత జలాల్ని అందించే ప్రయత్నం చేసింది. ఖైదీల్లో ఆధ్యాత్మిక చింతన కలిగించి, వారిలో మానసిక ప్రశాంతత కల్పించాలన్న ఉద్దేశంతో మహాకుంభ్ జలాల్ని జైళ్లకు తీసుకెళ్లినట్లు డీఐజీ సుభాష్ చంద్ర సాక్య తెలిపారు.
VIDEO | UP: The prisoners at Bhadohi Jail took ‘snan’ enthusiastically in water brought from Triveni Sangam.
Abhishek Kumar Singh, Jail Superintendent says, “As per the instructions from the headquarters, the water that was brought from Triveni Sangam was made available to the… pic.twitter.com/A9dZb9gxhn
— Press Trust of India (@PTI_News) February 22, 2025
యూపీలోని సుమారు 75 ఏళ్లలకు ఆ నీళ్లను తీసుకెళ్లారు. లక్నో, అయోధ్య, అలీఘడ్, ఘజియాబాద్, నోయిడా జిల్లాల్లో ఉన్న జైళ్లకు కుంభ్ జలాల్ని కలశాల్లో తరలించారు. వేద పండితులు పూజలు నిర్వహించిన తర్వాత ఆ జలాలను.. జైళ్లలోని స్నానం చేసే నీటిలో కలిపారు.
Amazing
UP govt gets Gangajal from Sangam transported to jails in the state for prisoners to take a holy bath.👇 Adarsh Jail Lucknow, where jail minister Dara Singh Chauhan is conducting the event.
If you can’t go to Kumbh, Kumbh will come to you, even if you are in jail. pic.twitter.com/ggQuspX8iW
— Omar Rashid (@omar7rashid) February 21, 2025
కలశాల్లో తీసుకువచ్చిన నీటిని.. జైళ్లలో ఉన్న చిన్నపాటి ట్యాంకుల్లో కలిపారు. యూపీ జైళ్ల శాఖ మంత్రి దారా సింగ్ చౌహాన్ లక్నోలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 90 వేల మంది ఖైదీలకు అమృత జల స్నానం కలిగే భాగ్యాన్ని ప్రసాదించినట్లు తెలిపారు.
Amazing
UP govt gets Gangajal from Sangam transported to jails in the state for prisoners to take a holy bath.👇 Adarsh Jail Lucknow, where jail minister Dara Singh Chauhan is conducting the event.
If you can’t go to Kumbh, Kumbh will come to you, even if you are in jail. pic.twitter.com/ggQuspX8iW
— Omar Rashid (@omar7rashid) February 21, 2025
తమ జైలులో స్నాన పర్వాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించినట్లు అలీగడ్ సూపరిండెంట్ బ్రిజేంద్ర సింగ్ యాదవ్ తెలిపారు. అయోధ్య జైలులో ఉన్న 757 మంది ఖైదీలు పుణ్యం స్నానం చేసినట్లు ఉదయ్ ప్రతాప్ మిశ్రా తెలిపారు.