పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్(Dilip Jaiswal) ఇవాళ ఎన్నికల సంఘానికి ఓ అభ్యర్థన లేఖ సమర్పించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఒకటి లేదా రెండు దశల్లో నిర్వహించాలని ఆయన కోరారు. ఇక పోలింగ్ బూత్‌లకు బుర్కాల్లో వచ్చే మహిళల ఓటరు కార్డులను సరిగా పరిశీలించాలని ఆయన విన్నవించారు. దిలీప్ జైస్వాల్ నేతృత్వంలోని బీజేపీ బృందం ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ ను కలిసింది. పారామిలిటరీ దళాలను అధిక సంఖ్యలో మోహరించాలని కోరారు. బూత్ చోరీ, ఓటర్లను భయపెట్టే ప్రాంతాల్లో దళాలు ఎక్కువగా ఉండాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీను ప్రకటించనున్నది.
#WATCH | Patna | Bihar BJP President Dilip Jaiswal says, “The Election Commission has requested political parties to ensure that their polling agents surely collect Form 17C when voting ends in the evening… Some political parties’ polling agents leave early, and then the blame… https://t.co/vqWUvoCdDb pic.twitter.com/z7qN5LhrBe
— ANI (@ANI) October 4, 2025