హనుమకొండ చౌరస్తా : కాకతీయ యూనివర్సిటీలో హోరాహోరీగా యూనివర్సిటీ ఇంటర్ కాలేజీయేట్ హాకీ సెలక్షన్స్జరిగాయి. యూనివర్సిటీ క్రీడామైదానంలో ఈ సెలెక్షన్స్ నిర్వహించారు. ఇందులో ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుంచి 40 మంది హాకీ క్రీడాకారులు పాల్గొన్నారని స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై వెంకయ్య తెలిపారు.
ఇందులో ఎంపికైన క్రీడాకారులు చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో జరగబోయే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ హాకీ టోర్నమెంట్లో పాల్గొంటారని చెప్పారు. వీరికి ముందస్తుగా 15 రోజుల శిక్షణ ఇవ్వటం కోసం ఎంపిక జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎస్ కుమార్, సెలక్టర్స్ కే సునీల్‌రెడ్డి, కే శ్రీనివాస్, సయ్యద్ హసీన్, కే రాకేశ్ సెలెక్టర్లుగా వ్యవహరించారు.