Muda Scam : ముడా స్కామ్లో కర్నాటక సీఎం సిద్ధరామయ్య విచారణకు రాష్ట్ర గవర్నర్ అనుమతించడంపై కర్నాటక మంత్రి హెచ్కే పాటిల్ స్పందించారు. బెంగళూర్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం సిద్ధరామయ్య విచారణకు సంబంధించి గవర్నర్ నిర్ణయం తప్పని, దీనిపై తాము న్యాయస్ధానాల్లో పోరాడుతున్నామని హెచ్కే పాటిల్ పేర్కొన్నారు.
ఇక ముడా స్కామ్ కేసులో తనపై ప్రాసిక్యూషన్కు తక్షణమే ఆమోదం తెలిపిన గవర్నర్ వివక్ష ప్రదర్శించారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. మైనింగ్ కేసులో కేంద్ర మంత్రి, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి విచారణకు అనుమతించడంలో మాత్రం జాప్యం చేస్తున్నారని ఇది వివక్ష కాక మరేమిటని సీఎం ప్రశ్నించారు. సిద్ధరామయ్య బుధవారం కొప్పోల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తనపై ఎలాంటి దర్యాప్తు నివేదికను పరిగణనలోకి తీసుకోకుండానే గవర్నర్ సత్వరమే తన ప్రాసిక్యూషన్కు అనమతించారని. ఇది గవర్నర్ వివక్ష ధోరణి కాదా అని సీఎం నిలదీశారు. కాగా, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పాలక, విపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
Allu Arjun | అల్లు అర్జున్ అప్డేట్ చెప్పేస్తాడట.. రెడీగా వుండండి..!