Allu Arjun | అల్లు అర్జున్ అప్డేట్ చెప్పేస్తాడట.. రెడీగా వుండండి..!
ఈ రోజు చాలా కాలం గ్యాప్ తరువాత అల్లు అర్జున్ మారుతి నగర్ సుబ్రమణ్యం అనే సినిమా ప్రీరిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడు. అంతేకాదు ఇదే ఫంక్షన్‌కు సుకుమార్ కూడా ప్రత్యేక అతిథిగా వస్తున్నాడు...ఇక అందరి దృష్టి బన్నీ, సుకుమార్‌ల స్పీచ్ పైనే.. ఇప్పటి వరకు వున్న రూమర్స్‌కు వీళ్లు ఈ వేదికపై గట్టి సమాధానం చెప్పబోతున్నాడని, అన్ని రూమర్లకు చెక్ పెడుతున్నారని వాళ్ల శ్రేయోభిలాషులు అంటున్నారు
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప-2 క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇంతకు ముందు ఇదే కలయికలో రూపొందిన పుష్ప దిరైజ్కు సీక్వెల్.. పుష్పరాజ్‌గా మొదటిపార్ట్తో అల్లు అర్జున్ తన నటనతో, సుకుమార్ తన టేకింగ్‌తో ఎంతటి సన్సేషన్ సృష్టించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన రెండు సాంగ్స్ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. అంతేకాదు ఈ సినిమా నుంచి వదిలిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు కూడా అనూహ్య స్పందన వచ్చింది. మొదటగా ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేద్డామనుకున్నారు. అయితే చిత్రీకరణ బ్యాలెన్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్‌గా వుండటంతో డిసెంబర్ 6కు చిత్ర విడుదలను వాయిదా వేశారు.
ఇక అప్పటి నుంచి ఈ చిత్రంపై పలు రూమర్స్ వస్తున్నాయి, అల్లు అర్జున్, సుకుమార్‌ల మధ్య గొడవలు, ఈ సినిమా మళ్లీ వాయిదా వేస్తారు. సమ్మర్‌కు రిలీజ్ చేశారు. ఇలా రకరకలా ఊహగానలు ఈ చిత్రంపై వున్నాయి. అంతేకాదు మెగాస్టార్ ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మనస్పర్థలు వచ్చాయని అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం వైసీపీ అభ్యర్థిని సపోర్ట్ చేయడంతో బన్నీని మెగా క్యాంప్ దూరం పెట్టిందని ఇలా రకరకాల ప్రచారాలు వున్నాయి.
అయితే ఇవన్నీ అసత్య ప్రచారాలన్నీ పలు సార్లు మెగాస్టార్ కాంపౌండ్, అల్లు ఫ్యామిలీ వాళ్లు చెప్పినా.. రూమర్స్ ఆగడం లేదు. ఇక ఈ రోజు చాలా కాలం గ్యాప్ తరువాత అల్లు అర్జున్ మారుతి నగర్ సుబ్రమణ్యం అనే సినిమా ప్రీరిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడు. అంతేకాదు ఇదే ఫంక్షన్‌కు సుకుమార్ కూడా ప్రత్యేక అతిథిగా వస్తున్నాడు.
ఇక అందరి దృష్టి బన్నీ, సుకుమార్‌ల స్పీచ్ పైనే.. ఇప్పటి వరకు వున్న రూమర్స్‌కు వీళ్లు ఈ వేదికపై గట్టి సమాధానం చెప్పబోతున్నాడని, అన్ని రూమర్లకు చెక్ పెడుతున్నారని వాళ్ల శ్రేయోభిలాషులు అంటున్నారు. నిజం చెప్పాలంటే అల్లు, మెగా ఫ్యామిలీలు ఎప్పుడైనా ఒక్కటే.. కానీ మధ్యలో వచ్చే ఈ రూమర్స్ మాత్రమే వాళ్లను విడిగా చూపిస్తున్నాయి అంటున్నారు ఇరువురి సన్నిహితులు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

