రాయ్‌పూర్ : తనకు హెచ్ఐవీ సోకడానికి కారణం దేవుడేనని ఆరోపిస్తూ 45 ఏళ్ల వ్యక్తి గుడుల్లోని హుండీలను దోచుకుంటున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనిని ప్రశ్నించినపుడు, 2012లో ఓ కేసులో తాను జైలులో ఉండగా హెచ్ఐవీ సోకిందని, దానికి కారణం దేవుడేనని ఆరోపించాడు.
అప్పటి నుంచి తనకు దేవుని పట్ల నమ్మకం పోయిందని అతను చెప్పాడు. దేవునికి తగిన బుద్ధి చెప్పడం కోసం, ప్రతీకారం తీర్చుకోవడం కోసం తాను గుడుల్లోని హుండీలను దోచుకున్నానని చెప్పాడు. దుర్గ్, దాని పరిసరాల్లోని సుమారు 10 గుడుల్లోని హుండీల్లో నగదును దొంగిలించానని అంగీకరించాడు.