న్యూఢిల్లీ, జనవరి 14: తుంటి మార్పిడి శస్త్రచికిత్సలో ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ వైద్యులు రికార్డు సృష్టించారు. కేవలం 15 నిమిషాల 35 సెకండ్లలో శస్త్రచికిత్సను పూర్తి చేశారు. సుమిత్ర శర్మ (85) ఎడమ తుంటి విరిగింది. ఆమె 18 ఏండ్ల క్రితం రొమ్ము క్యాన్సర్ బారిన పడి యాంజియోప్లాస్టీ చికిత్స తీసుకున్నారు. బ్లడ్ థిన్నర్ల కారణంగా ఆమెకు వీలైనంత వేగంగా శస్త్రచికిత్సను పూర్తి చేసేందుకు వైద్యుల బృందం ముందుగా ఆమెకు యాంజియోగ్రఫీ చేసి రికార్డు వేగంతో తుంటి మార్పిడి చేసింది.