మంగుళూరు: కర్నాటకలోని మంగుళూరులో హై అలర్ట్(Mangaluru High Alert) ప్రకటించారు. ఓ మర్డర్ కేసులో నిందితుడైన సుహాష్ శెట్టి అనే వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపారు. అయిదుగురు వ్యక్తులు కొడవల్లు, కత్తులతో అతన్ని నరికేశారు. నడ్డి రోడ్డుపై ఈ మర్డర్ జరిగింది. సీసీటీవీ ఆ దృశ్యాలు చిక్కాయి. స్థానిక హిందుత్వ సంస్థలతో అతనికి లింకు ఉన్నట్లు తెలిసింది. అతనిపై అనేక కేసులు ఉన్నాయి. 2022 మర్డర్ కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు. మహమ్మద్ ఫాజిల్ అనే వ్యక్తి మర్డర్ కేసులో సుహాష్ నిందితుడు. అయితే బీజేపీ యూత్ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్యకు ప్రతీకరంగా ఫాజిల్‌ను చంపి ఉంటారని భావిస్తున్నారు.
సుహాష్ శెట్టి హత్య నేపథ్యంలో మంగుళూరులో పోలీసులు నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తున్నారు. భారతీయ నారిక సురక్షా సంహితలోని 163వ సెక్షన్‌ను విధించారు. సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రజలు గుమ్మిగూడడాన్ని నిషేధించారు. ఊరేగింపులు, నినాదాలు చేయడం, ఆయుధాలను పట్టుకెళ్లడాన్ని నిషేధించారు. సుహాష్ను పథకం ప్రకారమే హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే ఆ మర్డర్ వెనుక ఉన్న కారణం ఇంకా తెలియరాలేదు.