Ajmer Dargah | జైపూర్: రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను శివాలయంగా ప్రకటించాలని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా అజ్మీర్ కోర్టులో పిటిషన్ వేశారు. సంకట మోచన శివాలయంపై ఈ దర్గాను నిర్మించారని, ఏఎస్ఐ చేత సర్వే చేయించాలని కోరారు.
దర్గా లోపల పూజలు చేసుకోవడానికి హిందువులకు అవకాశం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ ఈ పిటిషన్పై స్పందిస్తూ, రాజస్థాన్లో 11 లోక్ సభ స్థానాలను కోల్పోయిన తర్వాత అజ్మీర్ దర్గాపై బీజేపీ వివాదం సృష్టిస్తున్నదని ఆరోపించారు. ఎంఐఎం అధినేత ఒవైసీ స్పందిస్తూ.. దీనిపై మైనారిటీ శాఖ స్పందన తెలపాలని కేంద్ర మంత్రి రిజుజును కోరారు.