గువాహటి: మారుమూల ప్రాంతాల్లో అభద్రతా భావంతో నివసిస్తున్న స్థానికులకు ఆయుధ లైసెన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్టు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మారుమూల, ముప్పు ఉన్న ప్రాంత ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌ను సమీక్షించిన అనంతరం మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఆ ప్రాంతాల్లో స్థానికులై ఉండి, తగిన అర్హత ఉంటే ఆయుధ లైసెన్స్‌లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ ప్రాంతాల్లో ధుబ్రి, మోరిగావ్, బార్పేట, నాగావ్, దక్షిణ సల్మారా-మాంక్చార్ వంటి ప్రాంతాలు ఉన్నాయని, వారికి లైసెన్స్‌లు అందజేస్తామని ఆయన వివరించారు.