Himanta Biswa Sarma: అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ రాజీనామా.. 11వ తేదీ తర్వాతే మళ్లీ ప్రమాణం
Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. తన క్యాబినెట్ మిత్రులతో సహా ఆయన తన రాజీనామాను గవర్నర్ లక్ష్మణాచార్యకు సమర్పించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 102 సీట్లతో విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే.
గౌహతి: అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ(Himanta Biswa Sarma) బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. తన క్యాబినెట్ మిత్రులతో సహా ఆయన తన రాజీనామాను గవర్నర్ లక్ష్మణాచార్యకు సమర్పించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 102 సీట్లతో విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ఆయన రాజీనామా సమర్పించారు. మే 11వ తేదీ తర్వాతే ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని హిమంత శర్మ పేర్కొన్నారు. 126 స్థానాలు ఉన్న అస్సాంలో ఏప్రిల్ 9వ తేదీన ఎన్నికలు జరిగాయి.
బిశ్వశర్మ రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు సీఎంవో కార్యాలయం తన ఎక్స్లో పోస్టు చేసింది. అయితా తాత్కాలిక సీఎంగా కొనసాగమని హిమంతను గవర్నర్ కోరినట్లు తెలిసింది. లోక్భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకారోత్సవం మే 11వ తేదీ తర్వాత ఉంటుందన్నారు. తమ పార్టీ చరిత్రాత్మక విజయం సాధించిందని, ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించామని బిశ్వశర్మ తెలిపారు. బీజేపీ శాసనసభా పక్షం కొత్త సీఎంను ఎన్నుకుంటుందని ఆయన అన్నారు.
I had the privilege of calling upon Hon’ble Governor Shri @Laxmanacharya54 and formally initiating the process for formation of the new government by tendering my resignation as Chief Minister and recommending the dissolution of the 15th Assam Legislative Assembly.
Hon’ble… pic.twitter.com/31vx0XKKzg
— Himanta Biswa Sarma (@himantabiswa) May 6, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

