Himanta Biswa Sarma : బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనలతో రాజకీయ సంక్షోభం నెలకొన్న క్రమంలో పొరుగు దేశంలో అలజడి ప్రభావం భారత్‌పై పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
అసోం సీఎం గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దేశంలోకి ఏ ఒక్కరూ రాకుండా ఇండో-బంగ్లా సరిహద్దుల్లో పహారా ముమ్మరం చేయాలని కేంద్ర ప్రభుత్వం అసోం ప్రభుత్వానికి సూచించిందని చెప్పారు. కేంద్రం సూచనలతో బంగ్లా సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశామని, సరైన పాస్‌పోర్టులు, వీసాలు, దేశ పౌరులు మినహా ఎవరినీ మన దేశంలోకి అనుమతించడం లేదని తెలిపారు.
బంగ్లాదేశ్‌లో అశాంతి నేపధ్యంలో ఆ దేశంలో ఉంటున్న హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవుల భద్రతను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నదని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. బంగ్లాలో నివసించే భారతీయుల భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని చెప్పారు.
Read More :
Antim Panghal: రెజ్లర్ అంతిమ్ పంగల్ డిపోర్టేషన్.. ఆమె అక్రిడేషన్ రద్దు