పారిస్: రెజ్లర్ అంతిమ్ పంగల్(Antim Panghal)తో పాటు ఆమె బృందాన్ని.. పారిస్ ఒలింపిక్స్ నుంచి డిపోర్ట్ చేశారు. ఒలింపిక్స్ గేమ్స్ విలేజ్‌లోకి ఎంటర్ అయ్యేందుకు అంతిమ్ సోదరి భారతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ అక్రిడేషన్‌ను వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గేమ్ విలేజ్‌లో అంతిమ్ సోదర్ని పట్టుకున్న పోలీసులు.. కొంత విచారణ తర్వాత ఆమెను విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో అంతిమ్ బృందాన్ని డిపోర్ట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఘటన తర్వాత ఆమె అక్రిడేషన్‌ను కూడా రద్దు చేశారు.
53 కేజీల కేటగిరీల్లో టర్కీ ప్లేయర్ యెటిజిల్ జెన్యప్ చేతిలో 0-10 తేడాతో అంతిమ్ ఓడిపోయింది. క్రమశిక్షణా చర్యల కింద రెజ్లర్ అంతిమ్‌తో పాటు ఆమె సపోర్ట్ సిబ్బందిని వెనక్కి పంపాలని భారత ఒలింపిక్ సంఘం నిర్ణయించింది. దీనిపై ఏఓఏ ప్రకటన రిలీజ్ చేసింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత అంతిమ్ హోటల్ గదికి వెళ్లింది. అక్కడే కోచ్ భగత్ సింగ్, వికాస్‌లు ఉన్నారు. గేమ్స్ విలేజ్‌కు వెళ్లి.. తనకు సంబంధించిన వస్తువులను తీసుకురావాలని అంతిమ్ తన సోదరికి చెప్పింది. అయితే గేమ్స్ విలేజ్‌కు ఎంటర్ అయిన ఆమె సోదరి.. తిరిగి వెళ్తున్న సమయంలో సెక్యూర్టీ ఆఫీసర్‌కు దొరికిపోయింది. స్థానిక పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి ఆమె వాంగ్మూలాన్ని తీసుకున్నారు. 19 ఏళ్ల జూనియర్ వరల్డ్ చాంపియన్ అంతిమ్ నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు.
అంతిమ్ వద్ద ఉన్న పర్సనల్ సపోర్ట్ స్టాఫ్ కూడా అనుచితంగా ప్రవర్తించారు. వికాశ్, భగత్‌లు.. మద్యం మత్తులో.. క్యాడ్ డ్రైవర్‌కు డబ్బులు చెల్లించేందుకు నిరాకరించారు. దీంతో ఆ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.