ఉసురు తీసిన చలిమంట.. పొగతో ఊపిరాడక కూలీలు దుర్మరణం
Labourers death | హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. చలి నుంచి ఉపశమనం కోసం వేసుకున్న చలిమంట కూలీల పాలిట శాపమయ్యింది. షిమ్లా జిల్లాలోని
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. చలి నుంచి ఉపశమనం కోసం వేసుకున్న మంట కూలీల పాలిట శాపమయ్యింది. షిమ్లా జిల్లాలోని కోట్‌గఢ్ ఏరియాలో 9 మంది కూలీలు ఒకే గదిలో ఉంటున్నారు. వాతావరణం బాగా చలిగా ఉండటంతో ఇవాళ తెల్లవారుజామున గదిలోనే బొగ్గులతో చలిమంట వేసుకున్నారు.
ఆ చలిమంటే వాళ్ల పాలిట మృత్యుపాశంగా మారింది. మంట చల్లారిపోయి గదినిండా పొగ అలుముకుంది. దాంతో కూలీలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎట్టకేలకు అందరూ ఎలాగోలా గది తలుపులు తీసుకుని బయపడ్డారు. కానీ కాసేపటికే వారిలో ఇద్దరు శ్వాస ఆడక మరణించారు. మిగతా ఏడుగురు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అంతకుముందు ఘటనపై సమాచారం అందగానే స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. అనంతరం ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

