Eshwar Sai Wife | ప్రముఖ జానపద గాయకుడు, ‘బాసింగా బలాలు’ ఫేమ్ ఈశ్వర్ సాయి వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆయన భార్య శరణ్య చెక్ పెట్టింది. విడాకుల వార్తలు, గొడవలపై ఆమె స్పందిస్తూ కీలక ప్రకటన చేసింది.
మీ భర్త చేసిన పనికి విడాకులు ఇస్తున్నారా.. అని ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు శరణ్య మాట్లాడుతూ.. విడాకులు ఎందుకు ఇవ్వాలి? నా భర్తను నేను వదులుకోను. ఇరువర్గాలు కూర్చుని మాట్లాడుకుని అన్నీ సెటిల్ చేసుకున్నాం. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇక మా గురించి అనవసరంగా మాట్లాడటం ఆపండి అని ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య శరణ్య తేల్చిచెప్పారు. తమకు పెళ్లై ఏడేళ్లు అవుతోందని, ఆయన చాలా మంచివారని, అసలు తప్పు ఆయన వైపు లేదని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల వేములవాడ ఘటన తర్వాత కొద్దిగా ఉద్రిక్తత చోటుచేసుకున్నప్పటికీ, ఇప్పుడు అన్ని విషయాలు సర్దుమణిగాయని తెలిపారు. మా కాపురం గురించి ఇక ఎవరూ కూడా తప్పుడు వార్తలు సృష్టించవద్దని ఆమె మీడియాని, సోషల్ మీడియా యూజర్లను విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.