Siricilla | శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు
Siricilla | శక్తి వద్దు. పాలిటెక్నిక్ కాలేజీలు ముద్దు అని బీఆర్ఎస్వీ నాయకులు అన్నారు. పాలిటెక్నిక్ కాలేజీలను కాపాడాలని వారు కోరారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీని రద్దు చేసేవరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.
Siricilla | సిరిసిల్ల: GO 97 రద్దు కోరుతూ బీఆర్ఎస్వీ (BRSV) నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర స్వామి పాలిటెక్నిక్ కళాశాల ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న BRSV నాయకులపై పోలీసుల అత్యుత్సాహం తగదని ఆ సంఘం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. GO 97ను రద్దు చేయాలని ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై లాఠీచార్జ్ చేసిన పోలీసుల తీరును ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

Brsv 1
విద్యార్థుల డిమాండ్లపై చర్చించకుండా ప్రభుత్వం (Government) పోలీసులతో అణచివేయడం సరైన విధానం కాదని ఆయన అన్నారు. విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం, వారిపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు అనే నినాదంతో విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే GO 97ను రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Brsv 2
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

