మండి, జూలై 6: భారీ వర్షాలు, విరిగి పడుతున్న కొండ చరియలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతున్న హిమాచల్ ప్రదేశ్లో మృతుల సంఖ్య కనీసం 75కి చేరుకుంది. మండి జిల్లాలో వరదల్లో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 31 మంది గల్లంతయ్యారని మండి డిప్యూటీ కమిషనర్ అపూర్వ్ దేవ్గణ్ చెప్పారు.
మండి జిల్లాలో కుండపోత వర్షానికి దారుణంగా దెబ్బతిన్న తునాగ్కు చేరుకున్న ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసు బృందం సహాయక చర్యలను చేపట్టింది.బాధితులందరికీ సహాయం అందాలని హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు మండి ఆదేశించారు.