శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 26, 2021 , 14:52:53

గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

సిమ్లా : దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన రిపబ్లిక్‌ వేడుకల్లో ఆ రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, సీఎం జైరాం థాకూర్‌, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధానిలోని చారిత్రక రిడ్జ్‌ సిమ్లా వద్ద గవర్నర్‌ బండారు దత్తాత్రేయ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసులు, ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు, హోంగార్డు, ఆర్మీ, ఎన్‌సీసీ క్యాడెట్ల నుంచి గవర్నర్‌ గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సందర్భంగా అలరించాయి.


VIDEOS

logo