సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఏడుగురుకి క్యాబినెట్లో చోటు కల్పించారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమార్ వీరేంద్ర సింగ్‌తోపాటు ధరణి రామ్ షండిల్, చందర్ కుమార్, హర్షవర్ధన్ చౌహాన్, జగత్సింగ్ నేగి, రోహిత్ ఠాకూర్, అనిరుధ్ సింగ్ ఉన్నారు.
గతేడాది నవంబర్ 12న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పార్టీ విజయంలో మాజీ సీఎం భార్య వీరభద్రి సింగ్ సతీమణి, పీసీసీ అధ్యక్షుడులు రాణి ప్రతిభా సింగ్ కీలకపాత్ర పోషించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిభా సింగ్‌కు అవకాశం ఇస్తారని అంతా అనుకున్నప్పటికీ.. పార్టీ అధిష్ఠానం సుఖ్విందర్ సింగ్‌ను ఎంపిక చేసింది. దీంతో ఆయన డిసెంబర్ 11న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆయన తన మంత్రి వర్గాన్ని విస్తరించలేదు.
Himachal Pradesh cabinet swearing-in ceremony underway in Shimla in the presence of Governor Rajendra Vishwanath Arlekar, CM Sukhvinder Singh Sukhu and Deputy CM Mukesh Agnihotri pic.twitter.com/CKbSMAqhUC
— ANI (@ANI) January 8, 2023