న్యూఢిల్లీ, జూన్ 12: సుప్రీం కోర్టు జూన్ ఆరున జారీ చేసిన ఆదేశాల మేరకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 137 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్న విషయాన్ని ఆ ప్రభుత్వమే రుజువు చేయాలని ద అప్పర్ యమున రివర్ బోర్డు (యూవైఆర్బీ) సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది.
ప్రస్తుతం దేశ రాజధాని ఎదుర్కొంటున్న నీటి సమస్య పరిష్కారానికి 137 క్యూసెక్కుల మిగులు జలాలను దేశ రాజధాని ఢిల్లీతో పాటు హర్యానాకు విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాల ప్రకారం అది నీటిని విడుదల చేస్తున్నది, లేనిదీ అంచనా వేసే పరిస్థితిలో బోర్డు లేదని యూవైఆర్బీ తన అఫిడవిట్లో స్పష్టం చేసింది.