Hijab row | కర్ణాటకలో తెరచుకున్న పాఠశాలలు
Hijab | హిజాబ్ వివాదం కొనసాగుతున్న వేళ.. కర్ణాటకలో (Karnataka) పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. విద్యా సంస్థల్లో విద్యార్థినులు హిజాబ్
బెంగళూరు: హిజాబ్ వివాదం కొనసాగుతున్న వేళ.. కర్ణాటకలో (Karnataka) పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. విద్యా సంస్థల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో వివాదం ప్రారంభమయింది. క్రమంగా ఇది చిలికి చిలికి గాలివానలా మారింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వ్యాపించింది. దీంతో రెండు వర్గాల విద్యార్థులు పరస్పరం దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు మూసేస్తున్నట్టు ప్రభుత్వం గత మంగళవారం ప్రకటించింది.

అయితే పరిస్థితుల్లో కొంతమేరకు మార్పు రావడంతో నేటి నుంచి విడతలవారీగా విద్యా సంస్థలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి వరకు పాఠశాలలు సోమవారం తెలరచుకున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ఇతర విద్యాసంస్థలను తెరుస్తామని సీఎం ప్రకటించారు.

ఉడుపి జిల్లాలో మొదలైన హిజాబ్ వివాదం చిలికిచిలికి గాలివానగా మారి మతం రంగు పులుముకున్నది. తొలుత ఉడుపి, కోలార్ జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఈ ఆందళనలు..ఉద్రిక్తతలు మరింత విస్తరించాయి. కర్ణాటక ఉత్తర ప్రాంతానికీ పాకాయి. రెండు వర్గాలుగా విడిపోయి విద్యార్థులు పరస్పరం దాడులకు దిగారు. దీంతో ప్రభుత్వం అన్ని స్కూళ్లు, కాలేజీలను మూసేస్తున్నట్టు ఫిబ్రవరి 8న ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
‘నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

