మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 19:43:43

స్కూటర్ అమ్మకాలలో నెంబర్ వన్ గా నిలిచిన హీరో

 స్కూటర్ అమ్మకాలలో నెంబర్ వన్ గా నిలిచిన హీరో

ముంబై : భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫాస్ట్-పేస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మార్కెట్ లీడర్ గా నిలిచింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో భారతదేశంలో మొత్తం 3,088 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడుపోయాయి. ఒకినావా ఏథర్ తర్వాత స్థానాన్ని హీరో ఎలక్ట్రిక్ ఆక్రమించింది. ఈ సమయంలో ఒకినావా 878 యూనిట్లు ఈథర్  438 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే పలు నివేదికల ప్రకారం హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటో టెక్ ఏథర్ ఎనర్జీ 2020 ఏప్రిల్ జూలై కాలంలో భారతదేశపు మూడు అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుల జాబితాలో చోటు దక్కించుకున్నది.

తక్కువ వేగం గల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో 45శాతం హీరో ఎలక్ట్రిక్ వాటా సొంతం చేసుకున్నది. ఇది మొత్తం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో ప్రధాన వాటాను కలిగి ఉందని సీఈఓ తెలిపారు. అంతేకాకుండా కొత్త ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల్లో పెద్ద సంఖ్యలో కొత్త కస్టమర్లను చేర్చుకున్నట్లు కంపెనీ తెలి పింది. ఫలితంగా సంస్థ ఆన్‌లైన్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో ఆరు రెట్లు పెరిగాయని తెలిపారు. దీనిపై హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ.. కరోనా లాక్ డౌన్ లో కూడా సంస్థ లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారుగా నిలబడిందని సీఈఓ తెలిపారు.logo