కోల్‌కతా : విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్స్‌తో కూడిన వీడియోలు (Viral Video) సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తుంటాయి. ఈ క్లిప్స్ చూసిన తర్వాత బాబోయే ఇదేం కాంబినేషన్ అంటూ వాటిపై నెటిజన్లు పెదవివిరుస్తుంటారు. లేటెస్ట్గా ఇన్‌స్టాగ్రాంలో కోల్‌కతా వైరల్ రసగుల్లా రోల్ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వీధి వ్యాపారి రోల్ తయారుచేస్తూ కనిపిస్తాడు.
పరాటా తయారు చేసిన తర్వాత దానిపై ఉడికించిన కూరగాయలు, సాస్, కొన్ని రసగుల్లాలు ఉంచుతాడు. ఆపై దానిపై మయనీస్ జోడించి రోల్ చేస్తాడు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకూ ఏకంగా లక్ష మందికి పైగా వీక్షించారు.
Read More
Sharat Saxena | నా మొహం నాకు నచ్చలేదు.. ఎప్పుడూ నన్ను నేనే తిట్టుకునేవాడిని: శరత్ సక్సేనా