బెంగళూరు: రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన నటి హేమ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఆమెకు ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని ఆమెను కోర్టు ఆదేశించింది. ఆమె ఈ నెల 3 నుంచి కస్టడీలో ఉన్నారు.
బెంగళూరు సీసీబీ పోలీసులు మే 19న రేవ్ పార్టీపై నిర్వహించిన దాడిలో హేమ సహా 86 మంది పట్టుబడిన సంగతి తెలిసిందే. వీరి రక్త నమూనాలను సేకరించి, పరీక్షలు చేయించారు. వీరు మాదక ద్రవ్యాలను సేవించినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. అయితే తాను మాదక ద్రవ్యాలను సేవించలేదని హేమ చెప్తున్నారు.