BS Yediyurappa: యడ్యూరప్ప హెలికాప్టర్‌కు తప్పిన ప్రమాదం.. వీడియో
BS Yediyurappa:యడ్డీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ల్యాండింగ్ సమయంలో హెలిప్యాడ్ చుట్టూ ప్లాస్టిక్ వ్యర్ధాలు గాలిలో లేచాయి. దీంతో పైలెట్ ఆ హెలికాప్టర్‌ను దూరం తీసుకెళ్లాడు.
కాల్బుర్గి: కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప(BS Yediyurappa) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్(Helicopter landing) సమయంలో అనూహ్య సంఘటన చోటుచేసుకున్నది. హెలికాప్టర్‌ను దించే సమయంలో.. ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ చెత్త, వ్యర్ధాలు గాలిలోకి లేచాయి. దీంతో గందరగోళం ఏర్పడింది. ఆ సమయంలో హెలికాప్టర్‌ను పైలెట్ ల్యాండ్ చేయలేదు. అయితే సెక్యూర్టీ దళాలు హెలిప్యాడ్(Helipad) గ్రౌండ్‌ను క్లియర్ చేసిన తర్వాత ఆ చాపర్‌ను దించారు. ఈ ఘటన కాల్బుర్గిలో ఇవాళ ఉదయం జరిగింది.
#WATCH | Kalaburagi | A helicopter, carrying former Karnataka CM and senior leader BS Yediyurappa, faced difficulty in landing after the helipad ground filled with plastic sheets and waste around. pic.twitter.com/BJTAMT1lpr
— ANI (@ANI) March 6, 2023
హెలికాప్టర్ ల్యాండ్ కాలేని స్థితిలో హెలిప్యాడ్ వద్ద చెత్త గాలిలోకి ఎగిరింది. ఆ ఘటనకు చెందిన వీడియోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్లాస్టిక్ షీట్లు గాలిలోకి ఎగురుతున్న సమయంలో.. చివరి నిమిషంలో పైలట్ హెలికాప్టర్‌ను దారి మళ్లించాడు. హెలిప్యాడ్‌ను అధికారులు క్లియర్ చేసే వరకు ఆ హెలికాప్టర్ అక్కడే తిరిగింది.
హెలిప్యాడ్‌పై సురక్షితంగా ఆ హెలికాప్టర్ దిగినట్లు కాల్బుర్గి ఎస్పీ ఇషా పంత్ తెలిపారు. జన సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు మాజీ సీఎం యడ్యూరప్ప కాల్బుర్గి పర్యటనకు వెళ్లారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

