Rajiv Kumar | భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ( chief election commissioner) రాజీవ్ కుమార్ (Rajiv Kumar)కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ (Helicopter) అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ (Uttarakhand)లో బుధవారం చోటు చేసుకుంది.
సీఈసీ రాజీవ్ కుమార్, ఉత్తరాఖండ్ అదనపు సీఈవో విజయ్ కుమార్‌తో కలిసి మున్సియారీకి హెలికాప్టర్లో బయల్దేరారు. అయితే, హెలికాప్టర్ పర్వత ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పైలట్ హెలికాప్టర్‌ను పిథోరాగఢ్ (Pithoragarh) జిల్లాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతం హెలికాప్టర్లో ఉన్నవారంతా సురక్షితంగా ఉన్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. వాతావరణం అనుకూలించిన తర్వాత వీరు తమ పర్యటనను కొనసాగిస్తారని పేర్కొంది.
Also Read..
Bomb Threat | మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు
DA | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ 3 శాతం పెంపు..!
Nayab Singh Saini | శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన నయాబ్ సింగ్ సైనీ.. రేపే సీఎంగా ప్రమాణం