నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం అర్ధరాత్రి ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నాలుగు గంటల పాటు కురిసిన భారీ వర్షం వల్ల 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. అంబాజరి సరస్సు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. 180 మందిని ఖాళీ చేయించి సురక్షిత పాంతాలకు తరలించారు. భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున నాగ్‌పూర్ వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.