Tamilnadu : పండుగ పూట చెన్నైని వరుణుడు వణికిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురవడంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. చెన్నై సమీపంలోని వెలాచెరీ, మేడవక్కం, పల్లికరనాయ్తో పాటు ఈసీఆర్ నీలంకారీ ప్రాంతాల్లో వాన దంచికొట్టడంతో దీపావళి షాపింగ్‌కు బయటకు వచ్చిన జనం, ప్రయాణికులు వరద నీటిలో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. తూతుకూడిలో అయితేవరుసగా నాలుగు రోజులు వాన పడుతుండడంతో జనజీవనం స్తంభించింది. పలు కాలనీల్లో వరద నీరు చేరడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
పలు జిల్లాల్లోతేలికపాటి నుంచి మోస్తరు వానలు, ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ (India Meteorological Department) తెలిపింది. మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే వీలుందని, దీని ప్రభావంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎరోడ్, నీలగిరి, కోయంబత్తూర్, తిరుప్పూర్, దిండిగుల్, మదురై, రామనాథపురం, శివగంగ, పుడుక్కొట్టాయ్, తంజావూరు, తిరువరూర్, కరైకల్.. కాంచీపురం జిల్లాల్లో 64.5 మిల్లీ మీటర్ల నుంచి 111.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
#WATCH | Tamil Nadu | Heavy rain accompanied by thunder and lightning triggers waterlogging in parts of Thoothukudi. pic.twitter.com/fpVuXmQlnS
— ANI (@ANI) October 19, 2025
రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నందున అధికారులతో ఆదివారమే ముఖ్యమంత్రి స్టాలిన్(CM Stalin) సమీక్షసమావేశం నిర్వహించారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా సంభవిస్తున్న వర్షాలతో ప్రజలు ఇ్బందులు పడకుండా చూసేందుకు జిల్లా యంత్రాంగాన్ని, రాష్ట్ర అత్యవసర సేవల విభాలు సంసిద్ధంగా ఉండాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఆదేశించారు. అంతేకాదు సముద్రతీరాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్టాలిన్ అధికారుకు సూచించారు.
Stalin