న్యూఢిల్లీ, నవంబర్ 23: డీప్ ఫేక్ వీడియోల నియంత్రణకు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. డీప్‌ఫేక్ వీడియోలను సృష్టించేవారికి, అలాంటి వీడియోలను వ్యాప్తి చేసే సోషల్ మీడియా సంస్థలకు భారీ జరిమానాలు విధిస్తామని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి నూతన నిబంధనావళిని రూపొందిస్తున్నామని, 10 రోజుల్లో అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. డీప్‌ఫేక్స్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వెలువడటంపై పలువురు సెలబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశంపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం సోషల్‌మీడియా కంపెనీల ప్రతినిధులు, నాస్కామ్, కృత్రిమ మేథ నిపుణులు తదితరులతో సమావేశమయ్యారు. వీడియోల కట్టడిపై సమావేశంలో చర్చించారు.