Heat wave | దేశంలో భానుడి ఉగ్రరూపం.. రానున్న వారం రోజులూ తీవ్ర వడగాలులు..!
Heat wave | దేశంలో భానుడు తన ఉగ్రరూపం చూపిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండలు భగభగ మండుతున్నాయి. జనం ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్లకే పరిమితం అవుతున్నారు. రానున్న వారం రోజులపాటు కూడా తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
Heat wave : దేశంలో భానుడు తన ఉగ్రరూపం చూపిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండలు భగభగ మండుతున్నాయి. జనం ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్లకే పరిమితం అవుతున్నారు. రానున్న వారం రోజులపాటు కూడా తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా వాయవ్య, మధ్య, తూర్పు భారత్‌లోని పలు మైదాన ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని అంచనావేసింది.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్లలోని పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. విదర్భ, ఆంధ్రాలోని తీరప్రాంతం, యానాం, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలోనూ వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది. శుక్రవారం ఉదయం దాదాపు 11 గంటల సమయానికి నమోదైన ఉష్ణోగ్రతల ప్రకారం.. ప్రపంచంలోనే 50 అత్యంత వేడి నగరాలన్నీ భారత్‌లోనే ఉన్నాయి. ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్ ఈ గణాంకాలను వెల్లడించింది.
జాబితాలోని సగం నగరాలు ఉత్తరప్రదేశ్లోనివే కావడం గమనార్హం. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బీహార్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలూ ఇందులో ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

