న్యూఢిల్లీ : కొత్తగా పెండ్లయిన నేవీ అధికారి జంటకు సిబ్బంది తొలిసారిగా స్వాగతం పలికిన వీడియోను ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయంకా సోషల్ మీడియాలో షేర్ చేశారు. లెఫ్టినెంట్ నీల్, ఆయన భార్య పార్వతికి తొలిసారి నేవీ సిబ్బంది స్వాగతం పలుకుతున్న ఈ క్లిప్ నెట్టంట వైరల్‌గా మారింది. నిమిషం వ్యవధి కలిగిన ఈ క్లిప్‌లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన లెఫ్టినెంట్ నీల్, పార్వతి జంటను నేవీ అధికారులు స్వాగతించడం కనిపిస్తుంది. తొలుత వీరికి స్వార్డ్ సెల్యూట్‌తో గ్రాండ్ వెల్కం లభించడం ఈ క్లిప్‌లో చూడవచ్చు.
That is how Indian Navy Officer Lt Neil and Parvathy got married. All three arms of the armed forces have their unique way to welcome the new bride into the tribe. So lovely! pic.twitter.com/EkjI6R1JOt
— Harsh Goenka (@hvgoenka) February 10, 2023
భార్య ఎదురుగా కొన్ని టాస్క్స్ పెర్ఫామ్ చేయాలని లెఫ్టినెంట్ నీల్‌ను సహోద్యోగులు టీజ్ చేయడం కనిపిస్తుంది. కొలీగ్స్ ఒత్తిడితో నీల్ పుషప్స్‌తో పాటు చెస్ట్ పంప్స్ చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. భారత నేవీ అధికారి లెఫ్టినెంట్ నీల్, పార్వతి వైవాహిక బంధంతో ఇలా ఒక్కటయ్యారు.
త్రివిధ దళాలు వినూత్న తరహాలో పెండ్లికూతురుకు స్వాగతం పలికాయి.. సో లవ్లీ! అంటూ హర్ష్ గోయంకా ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఈ వీడియోకు 68,000కుపైగా వ్యూస్ దక్కాయి. ట్విట్టర్ యూజర్లు ఈ వీడియోకు ఫిదా అయ్యారు. కొత్త జంటకు దేవుడి ఆశీస్సులు లభించాలని పలువురు యూజర్లు కామెంట్ చేశారు.