Heart Attacks | గుండెపోటు (Heart Attack) మరణాలు అందరినీ కలచివేస్తున్నాయి. పసిప్రాయం మొదలు నడివయస్సు వరకు పలువురు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. మరీముఖ్యంగా యువతే ఎక్కువగా గుండెపోటు బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు. ఈ మధ్య నిత్యం ఇలాంటి ఘటనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత యువగుండెకు ముప్పు వాటిల్లుతోంది. అప్పటివరకూ బాగానే ఉన్నవారు అంతలోనే ఉన్నచోటే కుప్పకూలి గుండెపోటుతో ప్రాణాలు వదులుతున్నారు.
2024లో భారత్‌లో హృదయ సంబంధిత మరణాలు ప్రధాన ఆరోగ్య సమస్యగా ఉన్నాయి. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు గుండెపోటుతో మరణిస్తున్నారు. అయితే, గుండెపోటు ఆకస్మాత్తుగా సంభవించదని (Heart Attacks Arent Always Sudden).. కొన్ని గంటలు, రోజులు, నెలలు, ఒక్కోసారి ఏడాది ముందే మన శరీరానికి హెచ్చరిక సంకేతాలు అందుతాయని (Warning Signs ) ఆరోగ్య నిపుణులు (Experts) చెబుతున్నారు.
ఛాతీలో అసౌకర్యం, అలసట, అజీర్ణం వంటి తేలికపాటి లక్షణాలు గుండెపోటుకు హెచ్చరిక సంకేతాలుగా పేర్కొంటున్నారు. వాటిని ప్రజలు విస్మరించడం వల్లే చివరికి ప్రాణాలు వదులుతున్నారన్నారు. ఇలాంటి లక్షణాలు అనిపించినప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఆకస్మిక గుండెపోటు సంభవించినప్పుడు ఛాతీలో తీవ్రమైన నొప్పి, అసౌకర్యం, ఊపిరి ఆడకపోవడం, తల తిరగడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కలినిపిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.
కొంతమందికి గుండెపోటుకు గురవడానికి కొన్ని రోజులు లేదా వారాల్లో అసాధారణ అలసట, ఛాతీలో అసౌకర్యం, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపించొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ప్రోడ్రోమల్ లక్షణాలు అంటారు. ఈ లక్షణాలను ప్రారంభ దశలో గుర్తించడం చాలా కష్టమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లక్షణాలను గుర్తించి సకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాద తీవ్రతను తగ్గించొచ్చని పేర్కొంటున్నారు. ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చేతులు, వీపు, మెడ, దవడ, కడుపులో నొప్పి లేదా అసౌకర్యం, తలనొప్పి లేదా తలతిరగడం, కోల్డ్ స్వెట్స్, వికారం లేదా వాంతులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read..
Dharmasthala | ధర్మస్థల మిస్టరీపై ముమ్మరంగా దర్యాప్తు.. తవ్వకాల్లో బయటపడ్డ ఎముకలు
Earthquake | గుజరాత్‌ను వణికించిన భూకంపం..
Elderly Man | వర్షంలోనూ వృద్ధుడి యోగాసనాలు.. వీడియో వైరల్