Earthquake | అహ్మదాబాద్ : గుజరాత్‌లోని కచ్ జిల్లాలో గురువారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదైనట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మాలాజికల్ రీసెర్చ్ (ISR) ప్రకటించింది. భూకంపం ఉదయం 9.52 గంటలకు సంభవించిందని పేర్కొంది. కచ్ జిల్లాలోని బేలాకు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు ఐఎస్ఆర్ తెలిపింది.
ఈ స్వల్ప భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని జిల్లా విపత్తుల నిర్వహణ అధికారి వెల్లడించారు. కచ్ జిల్లా భూకంపానికి వెరీ హై రిస్క్ జోన్ అని పేర్కొన్నారు. తక్కువ ప్రకంపనలతో ఇక్కడ తరుచుగా భూంకపాలు సంభవిస్తాయన్నారు. 2001లో సంభవించిన భూకంపం వల్ల కచ్‌లో 13,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు.