Priyanka Gandhi : లోక్‌సభ (Lok Sabha) లో ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ప్రసంగంపై కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన నాన్‌స్టాప్‌గా మహాకుంభమేళా (Maha Kumbh) పై ఆశావాద ప్రసంగం చేస్తూ పోయారని, ఇంకెవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అన్నారు. ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
ప్రతిపక్షాలకు కూడా వారు మాట్లాడాల్సిన పాయింట్స్, సెంటిమెంట్స్ ఉంటాయని ప్రియాంకాగాంధీ అన్నారు. తాము కూడా తమ అభ్రియాలను వెల్లడించాలి కదా.. అని ప్రశ్నించారు. కనీసం రెండు నిమిషాలైనా ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. మహాకుంభమేళా విజయం అందరూ కలసికట్టుగా చేసిన కృషికి నిదర్శనమని అన్నారు. ఈసందర్భంగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. ఈ విజయంపై దేశ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.