న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలియజేశారు. రాజీవ్ సతావ్ రాజకీయాల్లో బాగా ఎదుగుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ‘నా పార్లమెంట్ మిత్రుడు రాజీవ్ సతావ్ మరణం నన్ను కలచివేసింది. రాజీవ్ సతావ్ సమర్థమైన పనితీరుతో ఎదుగుతున్న నాయకుడు. రాజీవ్ సతావ్ కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’ అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు.
"He was an upcoming leader with much potential," tweets PM Narendra Modi on the demise of Congress MP Rajeev Satav pic.twitter.com/RM6jWIARDS
— ANI (@ANI) May 16, 2021
రాజీవ్ సతావ్లో కరోనా లక్షణాలు కనిపించడంతో ఏప్రిల్ 19న నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఏప్రిల్ 21న అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో కొన్నాళ్లు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నా పరిస్థితి విషమించడంతో ఆ తర్వాత ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు.