మంగళవారం 07 జూలై 2020
National - Jun 15, 2020 , 15:29:46

విమానాల్లో మధ్య సీట్ల భర్తీకి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

విమానాల్లో మధ్య సీట్ల భర్తీకి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ముంబై: విమానాల్లో మధ్య సీట్లను విమానయాన సంస్థలు భర్తీ చేసుకోవచ్చని బాంబే హైకోర్టు సోమవారం తెలిపింది. అయితే కరోనా వైరస్‌ నియంత్రణకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ జారీ చేసిన మార్గదర్శకాలను మాత్రం తప్పక పాటించాలని పేర్కొంది. ఎయిర్‌ ఇండియా పైలట్‌ దేవెన్ కనాని తన పిటిషన్‌లో లేవనెత్తిన అభ్యంతరాలను న్యాయమూర్తులు ఎస్ జె కథవల్లా, ఎస్ పి తవాడేతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. మధ్య సీటును ఖాళీగా ఉంచకపోయినా ప్రయాణికుల రక్షణ కోసం విమానయాన సంస్థలు తగిన చర్యలు తీసుకోగలవని పేర్కొంది. కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ‘వందే భారత్‌ మిషన్‌’లో భాగంగా ఎయిర్‌ ఇండియా విమానాల్లో స్వదేశానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే విమానాల్లో మధ్య సీట్లను కూడా భర్తీ చేస్తూ భౌతిక దూరం నిబంధనను ఆ సంస్థ ఉల్లంఘిస్తున్నదని, దీంతో ప్రయాణికులకు కరోనా ముప్పు పొంచి ఉన్నదంటూ ఎయిర్‌ ఇండియా పైలట్‌ దేవెన్ కనాని పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు సోమవారం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. logo