Rahul Gandhi | హత్రాస్ తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. బాధిత కుటుంబాల సమస్యలను రాహుల్ సీఎంకు వివరించారు. దీంతో పాటు పరిహారం మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే, బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా పరిహారం అందజేయాలన్నారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు సానుభూతి, సహాయం అవసరమని లేఖలో పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఈ లేఖను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి, గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పరిహారంపై రాహుల్ గాంధీ ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చాలా తక్కువ అని పేర్కొన్నారు. పరిహారం పెంచడంతో పాటు గాయపడిన వారికి సరైన చికిత్స అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. హత్రాస్ తొక్కిసలాట ప్రమాదంలో బాధిత కుటుంబాలను కలుసుకున్నానని.. వారి బాధను, సమస్యలను తెలుసుకున్న తర్వాత లేఖ రాస్తున్నట్లు తెలిపారు. వీలైనంత వరకు పరిహారం పెంచి బాధిత కుటుంబాలకు అందించాలన్నారు.
हाथरस में भगदड़ हादसे से प्रभावित पीड़ित परिवारों से मुलाकात कर, उनका दुख महसूस कर और समस्याएं जान कर उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री योगी आदित्यनाथ जी को पत्र के माध्यम से उनसे अवगत कराया।
मुख्यमंत्री जी से मुआवजे की राशि को बढ़ाकर शोकाकुल परिवारों को जल्द से जल्द प्रदान… pic.twitter.com/omrwp3QGNP
— Rahul Gandhi (@RahulGandhi) July 7, 2024