Hasanamba Temple | హసనాంబ ఆలయంలో తొక్కిసలాట.. విద్యుత్ తీగలు తెగి 20 మంది భక్తులకు కరెంట్ షాక్
Hasanamba Temple | కర్ణాటకలోని హసన్ (Hassan) జిల్లాలో ఉన్న ప్రఖ్యాత హసనాంబ ఆలయం (Hasanamba Temple) వద్ద తొక్కిసలాట (stampede) చోటుచేసుకుంది. విద్యుత్ తీగ తెగిపడటంతో కొంతమంది భక్తులు కరెంట్ షాక్ (electric shock )కు గురయ్యారు.
Hasanamba Temple | కర్ణాటకలోని హసన్ (Hassan) జిల్లాలో ఉన్న ప్రఖ్యాత హసనాంబ ఆలయం (Hasanamba Temple) వద్ద తొక్కిసలాట (stampede) చోటుచేసుకుంది. విద్యుత్ తీగ తెగిపడటంతో కొంతమంది భక్తులు కరెంట్ షాక్ (electric shock )కు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న ఇతర భక్తులు ఒక్క సారిగా భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యారు.
హసనాంబ ఆలయం ఏడాదిలో వారం రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఏటా దీపావళికి ఏడు రోజులు ముందు ఆలయాన్ని తెరుస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఏటాలాగే ఈ ఏడు కూడా ఆలయంలో నవంబర్ 2వ తేదీ నుంచి వార్షిక హసనాంబ జాతర మహోత్సవం జరుగుతోంది. ఈ ఉత్సవం నవంబర్ 14తో ముగియనుంది. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. శుక్రవారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ సందర్శనకు పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం మధ్యాహ్నం క్యూలో నిల్చున్న సమయంలో విద్యుత్ తీగ తెగి పడటంతో 20 మంది భక్తులు కరెంట్ షాక్‌కు గురయ్యారు. దీంతో భయాందోళనకు గురైన భక్తులు క్యూ నుంచి బయటకు వచ్చేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యారు. వెంటనే స్పందించిన ఆలయ నిర్వాహకులు, స్థానిక పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని హసన్ ఎస్పీ మహ్మద్ సుజిత తెలిపారు.
Hassan SP Mohammad Sujitha says, “Around 1.30pm, there was some electric shock due to a wire broken nearby. People panicked and started rushing. KEB and HESCOM officials are here. They’re checking. Three people sent to hospital, a few others also sent to hospital. Doctors have…
— ANI (@ANI) November 10, 2023
ఆలయ ప్రత్యేకత..
ఈ హాసనాంబ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. సంవత్సరం పొడవునా ఈ ఆలయం తెరిచి ఉండదు. ఏడాదిలో వారం రోజులు మాత్రమే ఆలయం భక్తులకు అందుబాటులో ఉంటుంది. దీపావళికి ఏడు రోజుల ముందు ఈ దేవాలయం తలపులను తీస్తారు. దీపావళి రోజున ఆలయాన్ని మూసివేస్తారు. ఆ సమయంలో.. అమ్మవారిని ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు సందర్శించుకోవచ్చు. ఆలయాన్ని మూసే ముందు నెయ్యితో దీపం వెలిగిస్తారు. రెండు బస్తాల బియ్యం, నీరు పెట్టి ఆలయ తలుపుల్ని వేసేస్తారు. ఆ నెయ్యి దీపం తిరిగి ఆలయ తలుపులు తెరిచే వరకూ వెలుగుతూనే ఉంటుందట. పువ్వులు కూడా వాడిపోవని.. దేవత ముందు పెట్టిన రెండు బస్తాల అన్నం కూడా వేడిగానే ఉంటుందని స్థానికులు చెబుతారు. అది కూడా తినడానికి అనుకూలంగానే ఉంటుందని, ఆలయ తలుపులు తెరిచిన తర్వాత ఆ అన్నాన్ని భక్తులు ప్రసాదంగా తీసుకుంటారని చెబుతారు.
Also Read..
Virat-Anushka | రెండో బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క..? అనుష్క బేబీ బంప్ వీడియో వైరల్
Bengaluru Ragpicker | చెత్త కుప్పలో రూ.25కోట్లు.. నకిలీవిగా తేల్చిన ఆర్బీఐ
Fresh Snowfall | ఉత్తరాదిపై మంచు వర్షం.. వీడియోలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

