Virat-Anushka | రెండో బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క..? అనుష్క బేబీ బంప్ వీడియో వైరల్
Virat-Anushka | బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli), నటి అనుష్క శర్మ (Anushka Sharma) జంట ఒకటి. వీరిద్దరూ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అనుష్కకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Virat-Anushka | బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli), నటి అనుష్క శర్మ (Anushka Sharma) జంట ఒకటి. వీరిద్దరూ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంటారు. అటు విరాట్ క్రికెట్లో.. ఇటు అనుష్క సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ లైఫ్‌ని మాత్రం ఇద్దరూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. సమయం దొరికినప్పుడల్లా టూర్స్, డిన్నర్ డేట్స్ అంటూ సరదాగా గడుపుతుంటారు. కాగా, గత కొన్ని రోజులుగా ఈ జంట రెండో బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దంపతులిద్దరూ ముంబైలోని ఓ గైనకాలజీ ఆసుపత్రి వద్ద కనిపించినట్టు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అనుష్క రెండోసారి ప్రెగ్నెంట్ (Anushka Sharma Is Pregnant) అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ వార్తలపై ఇప్పటి వరకూ అనుష్క కానీ, విరాట్ కానీ స్పందించలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా అనుష్కకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రెండు రోజుల క్రితం అనుష్క బెంగళూరులోని ఓ హోటల్ లాబీలో విరాట్‌తో కలిసి నడుచుకుంటూ వెళ్లింది. అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. వీడియోలో విరాట్ గ్రే కలర్ టీ-షర్ట్, బ్రౌన్‌కలర్ ప్యాంట్ ధరించగా.. అనుష్క బ్లాక్కలర్ వదులుగా ఉన్న ఫ్రాక్ను వేసుకున్నారు. డ్రెస్ కాస్త లూజ్‌గా ఉండటంతో బేబీ బంప్ ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇది గమనించిన నెటిజన్లు అనుష్క మరోసారి ప్రెగ్నెంట్ అంటూ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. కాగా, కోహ్లీ-అనుష్క దంపతులు 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక 2021లో ఈ జంటకు వామిక జన్మించింది.
Congratulations to Virat Kohli and Anushka Sharma ❤️❤️ #CWC23 pic.twitter.com/YMHHOelR5h
— Farid Khan (@_FaridKhan) November 9, 2023
Virat Kohli and Anushka Sharma at team’s hotel. pic.twitter.com/VLMQ6sUHEn
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 9, 2023
Also Read..
Bengaluru Ragpicker | చెత్త కుప్పలో రూ.25కోట్లు.. నకిలీవిగా తేల్చిన ఆర్బీఐ
Tirumala | శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లకు విశేష స్పందన.. 21 నిమిషాల్లోనే బుకింగ్స్ పూర్తి
Wipro | విప్రో ఉద్యోగులకు మరో షాక్.. వారికి జీతాల పెంపు ఉండదు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

