చండీఘర్ : హర్యానా మహిళా కమిషర్ చైర్పర్సన్ రేణు భాటియా, ఓ మహిళా పోలీసు ఆఫీసర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరికొకరు అసభ్యకర పదజాలంతో దూషించుకున్నారు. ఓ ఇద్దరు ఆలుమగల పంచాయితీ సందర్భంగా ఈ వివాదం చోటు చేసుకుంది.
హర్యానాలోని కైతాల్‌లో శుక్రవారం మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేణు భాటియా ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. అయితే ఓ మహిళ తన భర్త విడాకులు కోరుతున్నాడని రేణు భాటియాకు ఫిర్యాదు చేసింది. శారీరకంగా తాను ఫిట్‌గా లేనని భర్త వేధిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆమెకు మూడుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. భర్త ఒక్కసారి కూడా టెస్టులు చేయించుకోలేదు. అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని పోలీసు అధికారిణిపై రేణు భాటియా నిప్పులు చెరిగారు. దీంతో మహిళా పోలీసు ఏదో చెప్పబోతుండగా.. గెట్ ఔట్ అని రేణు భాటియా గట్టిగా అరిచారు. మీరు చెప్పేది నేను వినదల్చుకోలేదని రేణు తెలిపారు. పోలీసు ఆఫీసర్‌ను బలవంతంగా మరో ఆఫీసర్ బయటకు పంపించారు.